తమిళనాడు రాష్ట్రంలోని సేలం జిల్లాలో శుక్రవారం మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సేలం పట్టణ సమీపంలోని ఉత్తమశోలపురం వద్ద ఆర్టీసీ బస్సు అతివేగంగా వచ్చి అదుపుతప్పి మినీ వ్యాన్‌తో పాటు మరో బైక్‌ను బలంగా ఢీకొట్టింది. దీంతో వ్యాన్‌లో ప్రయాణిస్తున్న ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మరణించగా.. బైక్‌పై వెళ్తున్న తల్లీకుమారుడు అక్కడికక్కడే మరణించారు. తంతి టీవీ ప్రకారం.. ఈ బస్సు కోయంబత్తూరు నుంచి సేలం వెళ్తుండగా ప్రమాదం జరిగింది. మృతుల్లో పదకొండు నెలల పసికందు, ఐదేళ్ల చిన్నారి కూడా ఉండటం అక్కడి వారిని తీవ్రంగా కలచివేసింది.
ఈ ఘటనలో మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. జాతీయ రహదారిపై క్షణాల్లో జరిగిన ఈ భీకర ప్రమాదం స్థానికులను తీవ్ర భయాందోళనలకు గురిచేసింది. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం ఎనిమిది నిండు ప్రాణాలను గాలిలో కలిపేసింది.
